: తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు తెర లేచింది. తొలి దశ ఎన్నికలు జరగనున్న తెలంగాణకు ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను నేటి నుంచి స్వీకరిస్తారు. 9వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఏప్రిల్ 10న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 12 చివరి తేదీ.