: బీబీసీ జర్నలిస్టుల ధర్నా
విపరీతమైన పని ఒత్తిడి.. యాజమాన్య బెదిరింపులు..తట్టుకోలేక ప్రపంచ ప్రఖ్యాత బ్రాడ్ కాస్టింగ్ సంస్థ అయిన బీబీసీ జర్నలిస్టులు గళమెత్తారు.12 గంటల పాటు ధర్నాకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో వరల్డ్ రేడియో ఉద్యోగులు సైతం పాలుపంచుకున్నారు.
ఉద్యోగులంతా పనిచేయకపోవడంతో పాత వార్తలనే మళ్లీ మళ్లీ ప్రసారం చేయాల్సిన దుస్థితి తలెత్తింది. గురువారం మధ్యాహ్యం వరకూ ధర్నా కొనసాగింది. దీంతో యాజమాన్యం దిగివచ్చి క్షమాపణ చెప్పింది. చర్చకు రావాలని పిలిచింది.

ఫలితంగా ఏప్రిల్ 10వ తేదీన బీబీసీ డైరెక్టర్ జనరల్ తో జర్నలిస్ట్ యూనియన్ చర్చలు జరుపనుంది. చర్చలు ఫలప్రదం కాకుంటే మళ్లీ నిరసనకు దిగుతామని బీఈసీటీయూ జనరల్ సెక్రటరీ గెర్రీ మొరిస్సే చెప్పారు. ఈ ధర్నాకు నేషనల్ జర్నలిస్ట్ యూనియన్, బ్రాడ్ కాస్టింగ్ ఎంటర్ టైన్మెంట్, సినిమాటోగ్రఫీ అండ్ థియేటర్ యూనియన్ మద్దతు పలికాయి. ఇంతకుముందు ఫిబ్రవరి 18న కూడా జర్నలిస్టులు 24 గంటలపాటు ధర్నాకు దిగిన సంగతి విదితమే.