: మావోల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్


తొలి దశ సార్వత్రిక ఎన్నికలు తెలంగాణలో జరగనున్నాయి. ఈ ప్రాంతంలో మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలు 11 ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ను అనుమతిస్తారు. మావో ప్రభావిత నియోజకవర్గాల్లో భద్రాచలం, భూపాల్ పల్లి, ములుగు, అచ్చంపేట, కల్వకుర్తి, మంథని, చెన్నూరు, ఆసిఫాబాద్, ఖానాపూర్, సిర్ పూర్, కొల్లాపూర్ లు ఉన్నాయి. రెండో దశ ఎన్నికలు జరిగే సీమాంధ్ర ప్రాంతంలో మావోల ప్రభావం ఉన్న నియోజకవర్గాలు 10 ఉన్నాయి. వీటిలో మాచర్ల, వినుకొండ, పార్వతీపురం, అరకువ్యాలీ, పాడేరు, సాలూరు, పెదకూరపాడు, గురజాల, కురుపాం, రంపచోడవరం ఉన్నాయి.

  • Loading...

More Telugu News