: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న బాలకృష్ణ
బెజవాడ, ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ ఈ రోజు ఉదయం 'లెజెండ్' సినిమా యూనిట్ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో బాలకృష్ణకు స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాలకృష్ణ, బోయపాటి శ్రీను, యూనిట్ సభ్యులను వేద పండితులు ఆశీర్వదించారు. అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు.