: రేపు బీహార్ లో మోడీ, నితీష్ బస్తీమే సవాల్
నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఘాటు విమర్శలతో వేడెక్కించిన రాజకీయ ప్రత్యర్థులు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రేపు ఒకే జిల్లాలో ప్రచారం చేయనున్నారు. బీహార్ లోని నవాడ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలోని నడ్రీగంజ్ లో జరిగే ర్యాలీ, బహిరంగ సభలో నితీష్ కుమార్ పాల్గొంటుండగా, నవాడలో జరిగే బహిరంగ సభలో మోడీ పాల్గోనున్నారు.
వీరి సభలు మూడు గంటల తేడాలో జరుగనుండడం విశేషం. రెండు పార్టీల సభలను విజయవంతం చేసేందుకు ఆయా పార్టీల నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మోడీని వ్యతిరేకిస్తూ ఎన్డీయే నుంచి జేడీయూ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి మోడీకి, నితీష్ కుమార్ కి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.