: నలుగురు విద్యార్థినులు అదృశ్యం


శ్రీకాకుళం జిల్లా భామిని నగర పంచాయతీలోని బురండి గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థినులు అరుణ(8), ప్రియ(11), నవ్య(11), దివ్య(9) సోమవారం ఉదయం ఆడుకోవడానికని వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. సమీపంలోని సీతామహాలక్ష్మి చెరువు, పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినా పిల్లల ఆచూకీ తెలియలేదు. దీంతో విద్యార్థినులు నిన్నటి నుంచి కనిపించడం లేదని ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News