: గుజరాత్ బుడగ ఎన్నికల తరువాత పేలిపోతుంది: రాహుల్ గాంధీ
గుజరాత్ లో అభివృద్ధి నినాదంతో బీజేపీ తయారు చేసిన గాలిబుడగ లోక్ సభ ఎన్నికల తరువాత పేలిపోతుందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. జార్ఖండ్ లోని గొడ్డా జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2004, 2009 ఎన్నికల్లో భారత్ వెలిగిపోతోంది అంటూ ప్రచారం చేసుకున్న బీజేపీ కంగుతిందని, మరోసారి ఆ పార్టీకి అలాంటి పరిస్థితే ఎదురు కానుందని అన్నారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తామని రాహుల్ తెలిపారు.