: స్నేహితుల మధ్య ఫేస్ బుక్ వివాదం... కసిగా పొడిచి చంపేసిన స్నేహితురాలు


ఫేస్ బుక్ మిత్రుల మధ్య వివాదాన్ని రేపింది. బ్రిటన్ లో 16 ఏళ్ల ఎరాండీ ఎలిజబెత్, అనెల్ బేజ్ ఇద్దరూ మంచి స్నేహితులు. మిత్రులిద్దరూ నగ్నంగా ఉన్న ఫోటోలను అనెల్ ఫేస్ బుక్ లో ఆప్ లోడ్ చేసింది. ఈ విషయం తెలిసిన ఎలిజబెత్ తీవ్ర ఆగ్రహంతో, 'నేను ప్రశాంతంగా ఉన్నానని అనుకుంటున్నావు కానీ, నేను నిన్ను మూడు సార్లు హత్య చేశాను' అంటూ కామెంట్ పెట్టింది. అనెల్ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంది.

ఓ రోజు ఎలిజబెత్ ను అనెల్ తన ఇంటికి ఆహ్వానించింది. ఇంట్లో ఎవరూ లేని విషయం గమనించిన ఎలిజబెత్ అనెల్ ను వెనుకనుంచి విచక్షణారహితంగా కత్తితో 65 సార్లు పొడిచింది. అనెల్ అక్కడికక్కడే ప్రాణం విడవడంతో తన దుస్తులు, కత్తిపై రక్తపు మరకలు కడిగేసి సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ఎలిజబెత్ ప్రయత్నించింది. అయితే రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేయడంతో కథ అడ్డం తిరిగింది.

  • Loading...

More Telugu News