: అభిమానులతో చిరు సమావేశం
తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించడంతో కేంద్రమంత్రి చిరంజీవి అప్రమత్తమయ్యారు. కొద్దిసేపటి కిందట క్యాంపు కార్యాలయంలో పలువురు అభిమాన సంఘాల నేతలతో ఆయన భేటీ అయ్యారు. మాజీ మంత్రులు రఘువీరా రెడ్డి, వట్టి వసంత్ కుమార్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. అభిమానులకు అన్నదమ్ములు రెండు కళ్లు లాంటివారు. అలాంటిది ఇద్దరూ చెరొక పార్టీలో ఉండటంతో వారిలో ఆందోళన నెలకొంది. దాంతో, ఎవరివైపు నడవాలి? అనే విషయంపై సందిగ్థత నెలకొంది.