: రాష్ట్రానికి రెండు నెలల బడ్జెట్
రాష్ట్ర విభజన నేపథ్యంలో నూతన ఆర్థిక సంవత్సరానికి రెండు నెలలకే బడ్జెట్ విడుదల చేశారు. ఏప్రిల్, మే నెలలకు రాష్ట్ర బడ్జెట్ ను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నెం. 74ని ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ బడ్జెట్ మే 25వ తేదీ వరకు వర్తిస్తుంది. జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు విడివిడిగా బడ్జెట్ లు సమర్పించాలని కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది.