: చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా...!


తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో నందమూరి తారకరామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తర్వాత రాష్ట్రంలోనూ, జాతీయ రాజకీయాలలోనూ చాలా కీలక పాత్ర పోషించే స్థాయికి పార్టీని తీసుకెళ్లారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదం, నటుడిగా రామారావుకు ఉన్న విశేష అభిమానం కలిసి తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆదరణకు నోచుకుంది. 

తెలుగుదేశం పార్టీ నేటికి 31ఏళ్లు పూర్తి చేసుకుని 32వ సంవత్సరంలోకి ప్రవేశిస్తోంది. పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో వేడుకలు జరిపేందుకు ఏర్పాటు చేసినట్లు టీడీపీ నేతలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న అధ్యక్షుడు చంద్రబాబు పెదపూడిలో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ వేడుకలలో పాల్గొంటారని వెల్లడించారు. పార్టీకి సేవ చేసిన వారిని చంద్రబాబు సన్మానిస్తారని తెలిపారు. 

మరోవైపు విద్యుత్ సమస్యపై ఓల్డ్ ఎమ్మెల్యే కార్వర్ట్స్ లో నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ నేతలు అక్కడే పార్టీ వ్యవస్థాపక వేడుకలలో పాల్గొంటారు. 

  • Loading...

More Telugu News