: ఆసీస్ బౌలర్ల ధాటికి ఆదిలోనే తడబడిన బంగ్లాదేశ్
ఢాకాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఆదిలోనే తడబడింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (5), అనాముల్ హక్ (0) లను ఆసీస్ బౌలర్ నైల్ పెవిలియన్ చేర్చాడు. షకీబుల్ హసన్, ముష్ఫికర్ రహీంలు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 6 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది.