: మోడీకి వాక్చాతుర్యం లేదు: ఉమా భారతి
బీజేపీ ప్రధాని అభ్యర్థిపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బీజేపీ నేత ఉమాభారతి అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో ఆమె మాట్లాడుతూ, బీజేపీలో వక్త అంటే అటల్ బిహారీ వాజ్ పేయి మాత్రమేనని... ఆయన తరువాతే ఎవరైనా అని తేల్చిచెప్పారు. 'కావాలంటే నరేంద్ర మోడీ, వాజ్ పేయి ప్రసంగాలను వినండి' అంటూ ఆమె సూచించారు. ఇక్కడ తేడా ఒకటి ఉందని, తన వాక్చాతుర్యంతో వాజ్ పేయి బీజేపీని అధికారంలో నిలబెట్టారని, మోడీని ప్రజలు కోరుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.