: సోనియా, రాహుల్ పై పోటీ పెట్టం: అఖిలేష్ యాదవ్
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ (రాయ్ బరేలీ), రాహుల్ గాంధీ (అమేథి) పోటీ చేయనున్న నియోజకవర్గాల్లో పోటీ పెట్టకూడదని సమాజ్ వాదీ పార్టీ నిర్ణయించిందని యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ తెలిపారు. గతంలో అఖిలేష్, అతని భార్య డింపుల్ పై కాంగ్రెస్ పార్టీ పోటీకి పెట్టకపోవడంతో ఇప్పుడు ఎస్పీ రుణం తీర్చుకుంటోంది.