: రాహుల్ గాంధీ మంచి యాక్టర్: కుమార్ విశ్వాస్
కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ మంచి నటుడని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, అమేథి అభ్యర్థి కుమార్ విశ్వాస్ అన్నారు. అమేథిలో ఆయన మాట్లాడుతూ, ఆమేథి బరిలో రాహుల్ గాంధీ లాంటి నటుడు ఉండగానే, బీజేపీ నటి స్మృతి ఇరానీని రంగంలోకి దించిందని అన్నారు. గత 40 రోజులుగా ఆమేథి నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని, ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకుని ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై స్మృతి ఇరానీని రంగంలోకి దించాయని ఆయన మండిపడ్డారు.