: విశాఖలో మరో స్వైన్ ఫ్లూ మరణం


విశాఖలో మరో స్వైన్ ఫ్లూ మరణం చోటు చేసుకుంది. నగరంలోని శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు(35) గొంతునొప్పి, జ్వరం, జలుబు, ఆయాసం వంటి కారణాలతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అతని నుంచి నమూనాలు సేకరించి టెస్టుల కోసం ముంబయి ర్యాన్ బ్యాక్సీకి పంపారు. పరీక్షల్లో ఆ యువకుడికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయిందని మార్చి 29న చెప్పారు. నాలుగు రోజుల నుంచి వెంటిలేటర్ పై అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఉదయం అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఏడాది జనవరి 29న విశాఖలో స్వైన్ ఫ్లూతో ఓ గర్భిణి చనిపోయింది.

  • Loading...

More Telugu News