: లాలాజలంతో పిల్లల ప్రవర్తన చెప్పేయచ్చు!


కొంతమంది పిల్లలు ఇట్టే ఆవేశపడిపోతుంటారు. ఆ కోపంలో కొందరు హింసాత్మక పనులకు కూడా తెగబడుతుంటారు. ఇటువంటి పిల్లల నోట్లోని లాలాజలాన్ని పరీక్షించి, వాళ్ళ మనస్తత్వాన్ని ఇట్టే చెప్పేయచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. లాలాజలంలోని కొన్ని హార్మోన్ల మోతాదుకూ,  వారి కోపోద్రిక్త ప్రవర్తనకూ దగ్గరి సంబంధం వుందట. అమెరికాలోని సిన్సినాటి చిల్ద్రెన్ హాస్పిటల్ మెడికల్ సెంటర్ నేతృత్వంలో జరిగిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది.

లాలాజలంలో కనిపించే టెస్టోస్టిరాన్, డీ హైడ్రోఎపియాండ్రో స్టెరాన్, కార్టిజోల్ వంటి హార్మోన్లు ఏ మోతాదులో వున్నాయో పరిశీలించారు. పిల్లల్లో తీవ్రంగా కోపం రావడానికీ, హింసాత్మక ప్రవర్తనకూ ఈ హార్మోన్ల మోతాదులతో సంబంధం వున్నట్టు గుర్తించారు. ఇలాంటి పిల్లలకు ఎటువంటి చికిత్స చేయాలన్న దానిపై ఓ అవగాహనకు రావడానికి ఈ లాలాజలం పరీక్ష ఎంతో ఉపయోగపడుతుందని అధ్యయనకర్తలు చెబుతున్నారు.         

  • Loading...

More Telugu News