: హైహీల్ తో భర్తను కొట్టి చంపిన భార్య


ఆయన చాల మెతక...ఆమె మరీ ముతక అన్నట్టు అమెరికాలోని హూస్టన్ నగరంలో ఓ చిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అనా ట్రూజిలో, ఆల్ఫ్ స్టీఫెన్ ఆండర్సన్ భార్యాభర్తలు. చాలామంది జీవితాల్లోలాగే వీరికీ సమస్యలు, కలహాలు ఉన్నాయి. ఓ రోజు ఏం జరిగిందో తెలియదు కానీ ట్రూజిలోకి ఆండర్సన్ మీద పట్టరాని కోపం వచ్చింది. అంతే అతడిని ఎడాపెడా బాదేసింది. అయినా కోపం చల్లారలేదు.

అతడిని ఎత్తి కుదేసి అతని ఛాతిమీద కూర్చుని తన పాయింటెడ్ హై హీల్ షూతో అతని ముఖం మీద బాదేసింది. అంతే ముఖమంతా చిట్లిపోయి తీవ్ర రక్తస్రావంతో అతను చనిపోయాడు. దీంతో ట్రూజిలోపై కేసు నమోదైంది. న్యాయస్థానంలో లక్ష డాలర్ల పూచీకత్తు చెల్లించి ఆమె బెయిల్ పొందారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, అతనే తనపై దాడి చేశాడని, తనకు అందుబాటులో ఉన్న ఏకైక ఆయుధంతో ఆత్మరక్షణ చేసుకున్నానని చెబుతోంది.

  • Loading...

More Telugu News