: ఆర్టీసీ బస్సులో మంటలు.. ప్రయాణికులు సురక్షితం
మెదక్ జిల్లా కుకునూరుపల్లి మండలం కొండపాక శివారులో ఆర్టీసీ బస్సులో మంటలు వ్యాపించాయి. మంటలు గుర్తించిన డ్రైవర్ వెంటనే బస్సు ఆపివేసి చాకచక్యంతో బ్యాటరీ వైర్లు తెంపడంతో ప్రమాదం తప్పింది. అటు ప్రయాణికులను బస్సునుంచి దించివేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సు ఇంజిన్ లో షార్ట్ సర్య్కూట్ వల్లే మంటలు చెలరేగాయి. అయితే, బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, ప్రస్తుతం వారిని వేరే బస్సులో తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. కరీంనగర్ నుంచి హైదరాబాదు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ఆ బస్సు కరీంనగర్ డిపోకు చెందినదని గుర్తించారు.