: టీ20 ప్రపంచకప్ లో నేడు


బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ తలపడుతుంది. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ లో వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లు తలపడతాయి. అన్ని విభాగాల్లో పటిష్ఠంగా కనిపిస్తున్న వెస్టిండీస్ ఈ మ్యాచ్ లో హాట్ ఫెవరేట్. పాకిస్థాన్ జట్టు బలంగా ఉన్నప్పటికీ... మిడిలార్డర్ ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మ్యాచ్ లో గెలిచే జట్టు సెమీఫైనల్లో శ్రీలంకను ఢీకొంటుంది.

  • Loading...

More Telugu News