: టీడీపీ, బీజేపీ దోస్తీ ఖరారు
టీడీపీ, బీజేపీ పొత్తు ఖరారైంది. ఢిల్లీలో బీజేపీ నేతలు అరుణ్ జైట్లీ, ప్రకాశ్ జవదేకర్, కిషన్ రెడ్డి, దత్తాత్రేయలతో మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ, సుజనాచౌదరి జరిపిన చర్చలు ఫలించాయి. తెలంగాణలో 45 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలు బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. కాగా సీమాంధ్రలో సీట్లసర్దుబాటు జరగాల్సి ఉంది. సీమాంధ్రలో 25 శాసనసభ స్థానాలు బీజేపీ అడుగుతోంది. దానిపై నేటి రాత్రికి స్పష్టత రానుంది. దీంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేయనున్నాయి.