: సోనియాజీ... నేను కాల్చుకుని చచ్చేందుకు అనుమతించండి: బిట్టా


ఖలిస్థాన్ ఉగ్రవాది దేవీందర్ పాల్ సింగ్ భుల్లర్ మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడాన్ని యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆలిండియా మాజీ టెర్రరిస్ట్ ఫ్రంట్ నేత మనీందర్ జిత్ సింగ్ బిట్టా తప్పుపట్టారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తనను చంపేందుకు కుట్రపన్ని కాల్పులు జరిపిన భుల్లర్ కి శిక్షను తగ్గించడం రాజకీయ టెర్రరిజమేనని, ఇక తాను బతికి ఉండి లాభం లేదని అన్నారు. ఉగ్రవాదంపై పోరాటం చేసిన వారంతా ఈ తీర్పుతో ఓడిపోయినట్టైంది కనుక, కాల్చుకుని చచ్చిపోయేందుకు తనకు అనుమతి ఇవ్వండి అంటూ యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీని బిట్టా కోరారు.

  • Loading...

More Telugu News