: శ్రీనివాసన్ కు బీసీసీఐ షాక్
సుప్రీంకోర్టు ఆదేశాలతో బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్ కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు షాకిచ్చింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరిస్తూ బీసీసీఐలో భాగస్వాములుగా ఉన్న ఇండియా సిమెంట్స్ దాని అనుబంధ సంస్థలకు చెందిన వారిని తొలగిస్తూ బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం తొలగించిన, తొలగించాల్సిన వారి వివరాలు... ఇండియా సిమెంట్స్ లో కీలక బాధ్యతల నుంచి రెండేళ్ల క్రితం వైదొలగిన తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, శ్రీనివాసన్ సన్నిహితుడు కాశీ విశ్వనాథ్, టీమిండియా లాజిస్టిక్ మేనేజర్ సతీష్, ఐపీఎల్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ప్రసన్న కన్నన్, టీఎస్సీఏ, బీసీసీఐ లీగల్ కన్సల్టెంట్, శ్రీనివాసన్ న్యాయవాది పీఎస్ రామన్ ను తొలగిస్తూ బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.
బంగ్లాదేశ్ లో టీమిండియాతో పాటు ఉన్న లాజిస్టిక్ మేనేజర్ సతీష్ ను వెనక్కి రప్పిస్తున్నారు. కాగా ఇండియా సిమెంట్స్ లో ఉపాధ్యక్షుడిగా ఉన్న ధోనీ, అశ్విన్, దినేష్ కార్తిక్, రాహుల్ ద్రవిడ్, కామెంటేటర్ ఎల్ శివరామకృష్ణన్ వంటి వారు ఇండియా సిమెంట్స్ లో ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నారు.