: ఇంటి ముందు ధర్నాకు దిగుతా... సాబిర్ అలీ భార్య హెచ్చరిక
బీజేపీలో చేరిన జేడీయూ నేత సాబిర్ అలీని ఉద్దేశిస్తూ... "యాసిన్ భత్కల్ మిత్రుడు బీజేపీలో చేరారు, త్వరలో దావూద్ ఇబ్రహీం కూడా చేరతాడా?" అంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నక్వీ సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో డిఫెన్స్ లో పడిపోయిన బీజేపీ వెంటనే సాబిర్ అలీని పార్టీ నుంచి తొలగించింది. దీంతో ఆగ్రహానికి గురైన సాబిర్ అలీ కుటుంబ సభ్యులు..నఖ్వీ ఆరోపణలకు సాక్ష్యాధారాలను చూపాలంటూ డిమాండ్ చేశారు. ఆధారాలు చూపకపోతే నఖ్వీ ఇంటిముందు ధర్నాకు దిగుతానని అలీ భార్య హెచ్చరించింది.