: విప్ ధిక్కార ఎమ్మెల్యేలపై స్పీకర్ కు టీడీపీ ఫిర్యాదు
అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్టీ విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. టీడీపీ విప్ ధూళిపాళ్ళ నరేంద్ర వేసిన పిటిషన్ ప్రతిని స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, రాములు అందజేశారు.
ధిక్కార ఎమ్మెల్యేలు అమరనాథ రెడ్డి (పలమనేరు), ప్రవీణ్ కుమార్ రెడ్డి (తంబళ్ళపల్లి), కొప్పుల హరీశ్వర్ రెడ్డి (పరిగి), కొడాలి నాని (గుడివాడ), బాలనాగిరెడ్డి (మంత్రాలయం), సాయిరాజ్ (ఇచ్ఛాపురం), వనిత (గోపాలపురం), రామకోటయ్య (నూజివీడు)లపై అనర్హత వేటు వేయాలని టీడీపీ నేతలు కోరారు.