: మోడీపై పోటీ చేసి గెలుస్తా: రషీద్ అల్వీ
వారణాసి నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పోటీ చేయడానికి కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నట్టున్నారు. మోడీని ఓడిస్తామంటూ రోజుకో కాంగ్రెస్ నేత ముందుకొస్తున్నారు. గతంలో ఆనంద్ శర్మ, దిగ్విజయ్ సింగ్ లు మోడీపై పోటీకి సిద్ధమని తెలిపారు. ఇప్పుడు తాజాగా రషీద్ అల్వీ తాను మోడీపై పోటీ చేస్తానంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు లేఖ రాశారు. మోడీకి లౌకికవాదం అంటే ఏమిటో నేర్పిస్తానని తెలిపారు.