: సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ వార్ రూం సమావేశం
సాయంత్రం 5 గంటలకు వార్ రూంలో కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణలో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థులపై చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 7:30గంటలకు ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.