: పొన్నాలా... పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల ఆపగలవా?: ఈటెల రాజేందర్
తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ విరుచుకుపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 'కేసీఆర్ పై పొన్నాల విమర్శలు చేస్తే ఖబడ్దార్' అంటూ సవాలు విసిరారు. పొన్నాలకు చేతనైతే పోలవరం ప్రాజెక్టును అడ్డుకోగలరా? అంటూ సవాలు విసిరారు. పోతిరెడ్డుపాడు అక్రమ తవ్వకాలను ఆపగలరా? అని ప్రశ్నించారు. చేతనైతే పులిచింతల ప్రాజెక్టును అడ్డుకోవాలని సూచించారు.
అవన్నీ మానేసి, తెలంగాణ కోసం పుట్టిన కేసీఆర్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. విమర్శలు మాని ఆయా ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఈటెల సూచించారు. దళితులను ఓటు బ్యాంకుగా చూసిన కాంగ్రెస్ పార్టీ, దళితులకు ఏం చేసిందో చెప్పాలని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను నిలదీశారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిందని ఆయన స్పష్టం చేశారు.