: ఢిల్లీ వెళ్లనున్న కిషన్ రెడ్డి, హరిబాబు


భారతీయ జనతాపార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీమాంధ్ర ప్రాంత అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఇవాళ (సోమవారం) ఢిల్లీకి పయనమవుతున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి రావాలంటూ బీజేపీ అధిష్ఠానం నుంచి వీరిద్దరికి పిలుపు వచ్చింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను వారు అధిష్ఠానానికి వివరించనున్నారు. ఇరు ప్రాంతాల్లో పొత్తుల విషయమై చర్చ అనంతరం సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News