: 3వ తేదీన ఆర్టీసీ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ నిలిపివేత
ఏప్రిల్ 3వ తేదీన, బుధవారం అర్థరాత్రి 12 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఆర్టీసీ ఆన్ లైన్ ప్యాసింజర్ టికెట్ రిజర్వేషన్ సిస్టమ్ (ఓపీఆర్ఎస్)లో బుకింగ్ అందుబాటులో ఉండదు. నిర్వహణ నిమిత్తం ఓపీఆర్ఎస్ సేవలను ఒక రోజు నిలిపివేయనున్నట్లు సంస్థ ఈడీ ముక్కాల రవీందర్ చెప్పారు. ఈ సమయంలో ఆర్టీసీ కౌంటర్లు, ఏజెంట్లు, ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు చేయడం కుదరదని ఆయన అన్నారు.
ఆన్ లైన్ లో టికెట్లు కొన్నవారు వాటిని రద్దు చేసుకోవాల్సి వస్తే ఈ-మెయిల్ పంపించాలని ఆయన సూచించారు. సాధారణ టికెట్ల రద్దుకు ఆర్టీసీ కౌంటర్లలో సంప్రదించవచ్చని ఆయన అన్నారు. రిజర్వేషన్లు, టికెట్ల రద్దు తదితరాలను ముందుగానే చేసుకోవాలని ఆయన ప్రయాణికులను కోరారు.