: లక్ష్యాలు నిర్ధేశించుకోవడం నాకిష్టంలేదు: సచిన్


మరికొద్ది రోజుల్లో మొదలయ్యే ఐపీఎల్ టోర్నీ సందర్భంగా ఎలాంటి లక్ష్యాలు నిర్ధేశించుకోవడంలేదని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంటున్నాడు. అసలు లక్ష్యాలు పెట్టుకోవడం తనకిష్టం ఉండదని ఈ 'మాస్టర్ ఆఫ్ బ్యాటింగ్ ఆర్ట్' చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో సచిన్ ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అభిమానుల కోసం ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న విషయంపైనే తన దృష్టంతా అని సచిన్ పేర్కొన్నాడు. 

ఒకవేళ ఏవైనా లక్ష్యాలు పెట్టుకుంటే వాటిని తనలో ఉంచుకునేందుకే ఇష్టపడతానని చెప్పాడు. ఈ విషయంలో కాసింత మూఢనమ్మకాలు పాటిస్తానని అంగీకరించాడు. 'జట్టు పరంగా చూస్తే టైటిల్ గెలవడం అన్నది మా లక్ష్యం. ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ కు అదో అద్భుత కానుక అవుతుంది. గెలిచేందుకు మేం శాయశక్తులా కృషి చేస్తాం. ఆ తర్వాత ఆ భగవంతుడే ఉన్నాడు' అని సచిన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.   

  • Loading...

More Telugu News