: విజయశాంతిని ఏదో ఒకటి తెల్చుకోమన్న అధిష్ఠానం!


మెదక్ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో ఏది కావాలో తేల్చుకోవాలని ఎంపీ విజయశాంతికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తేల్చి చెప్పింది. ఇన్నాళ్లూ మెదక్ పార్లమెంటు నుంచే తాను బరిలో దిగుతానంటూ వేదికలపై అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విజయశాంతి, ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. టీఆర్ఎస్ లో తనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని, తనను వేధింపులకు గురి చేస్తున్నారని భావించిన విజయశాంతి ఆమధ్య కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలో ఆమె పార్లమెంటుకు పోటీ చేస్తారో లేక అసెంబ్లీకి పోటీ చేస్తారో ఆమె ఇష్టమని నిర్ణయాన్ని కాంగ్రెస్ ఆమెకే వదిలేసింది.

  • Loading...

More Telugu News