: సోనియాను కలసిన వివేక్, వినోద్... తిరిగి స్వగృహ ప్రవేశం!
యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జి వెంకటస్వామి కుమారులు ఎంపీ వివేక్, వినోద్ ఢిల్లీలో కలిశారు. సోనియా నివాసంలో ఆమెతో భేటీ అయిన వారిద్దరూ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని తెలిపారు. దీనిపై సోనియా గాంధీ హర్షం వ్యక్తం చేసి, వీరి నిర్ణయాన్ని స్వాగతించారు. దీంతో వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టైంది. దీనిపై నేటి మధ్యాహ్నం అధికారికంగా ప్రకటన చేయనున్నారు.