: సోనియా, రాహుల్ ప్రత్యర్థులను నేడు ప్రకటించనున్న బీజేపీ
నేడు ఢిల్లీలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశంకానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై పోటీ చేసే అభ్యర్థులను బీజేపీ ఫైనలైజ్ చేయనుంది. సోనియా ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి, రాహుల్ అమేధీ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్నారు. రాహుల్ పై నటి స్మృతి ఇరానీని బరిలో దించే అవకాశాలు కనపడుతున్నాయి. మరోవైపు సోనియాపై ఉమాభారతిని నిలబెట్టాలని యోగా గురువు బాబా రాందేవ్ బీజేపీకి సూచించారు.