: సీమాంధ్రను ప్రపంచ పటంలో నిలబెడతా: చంద్రబాబు
సీమాంధ్రను అభివృద్ధి చేసే అనుభవం, శక్తి కేవలం టీడీపీకే ఉన్నాయని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. సీమాంధ్రను ప్రపంచపటంలో నిలబెడతానని చెప్పారు. తెలుగుజాతిని తిరుగులేని శక్తిగా మారుస్తానని అన్నారు. ఈ రోజు రాయపాటి సోదరులు టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంకోసం రాయపాటి అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పేరు చెబితేనే సీమాంధ్ర ప్రజలు కొట్టే పరిస్థితి ఉందన్నారు. సీమాంధ్రకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ను తరిమికొడదామని పిలుపునిచ్చారు. సీమాంధ్రలో వైఎస్సార్సీపీని నమ్మే పరిస్థితి లేదని చంద్రబాబు చెప్పారు.