: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఉగాది శుభాకాంక్షలు


గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. జయ నామ సంవత్సరంలో అంతా సంతోషమే ఉంటుందని అందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సంవత్సరమంతా సౌభాగ్యమే ఉంటుందన్నారు. కష్టపడి సాధించేది విజయమని, కష్టపడకుండా భగవంతుడు ఇచ్చేది జయమని గవర్నర్ తెలిపారు. ఈ జయనామ సంవత్సరాన్ని భక్తి సంవత్సరంగా పాటించాలని నరసింహన్ కోరారు. ఉగాది పండుగ తన జీవితంలో చాలా ముఖ్యమైన పర్వదినమని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News