: ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఎన్నికల సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి సమీక్షించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే, ఐదు గంటలకు క్యూలైన్లలో వేచి ఉన్నవారు ఎంత ఆలస్యమైనా ఓటు వేసే అవకాశాన్ని కల్పించినట్టు ఎన్నికల కమిషనర్ చెప్పారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం నాడు రీపోలింగ్ నిర్వహించనున్నట్లు రమాకాంత్ రెడ్డి తెలిపారు. మడకశిరలో సీఐ లాఠీఛార్జి చేశారన్న ఫిర్యాదుపై విచారణకు ఆదేశించామని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా మాచర్లలోని 29వ వార్డులో పోలింగ్ సమయాన్ని గంట పాటు పొడిగించినట్టు ఆయన చెప్పారు.