: బీజేపీ ఆధ్వర్యంలో ఇవాళ ‘విజన్ ఫర్ బెటర్ ఇండియా’ చర్చాగోష్టి
హైదరాబాదులో ఇవాళ (ఆదివారం) భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ‘విజన్ ఫర్ బెటర్ ఇండియా’పై వివిధ రంగాల ప్రముఖులతో చర్చాగోష్టి జరుగనుంది. ఈ చర్చాగోష్టిలో ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వివిధ రంగాలకు చెందిన డాక్టర్ రమేష్ బాబు, డీవీ మనోహర్, హరీష్ చంద్ర ప్రసాద్, జేఏ చౌదరి తదితరులు ఈ చర్చాగోష్టిలో పాల్గొంటారని బీజేపీ నాయకులు తెలిపారు.