: పెద్దాపురంలో పోలింగ్ ను బహిష్కరించిన ఓటర్లు
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఓటర్లు పోలింగ్ ను బహిష్కరించారు. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల సమయంలో పలుకరించే నేతలు ఆ తరువాత తమను పట్టించుకోవడం లేదంటూ ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పెద్దాపురంలోని ఒకటో వార్డులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగలేదు.
పెద్దాపురం, దమ్ముపేటకు చెందిన సుమారు 200 మంది ఓటర్లు ఓటు వేయకుండా బహిష్కరించారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే రాజకీయ నాయకులు, తమకు అయిదేళ్ల కాలంలో ఏం చేశారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. పట్టణంలో కనీస వసతులు కూడా కల్పించనపుడు ఓటు వేసి ఏం లాభమని ఓటర్లు నిలదీస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తేనే ఓటేస్తామంటూ వారు తెగేసి చెప్పారు.