: విశాల హృదయంతో ఆలోచిస్తున్నాం: సోమిరెడ్డి
పొత్తులపై టీడీపీ విశాల హృదయంతో ఆలోచిస్తోందని ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు పొత్తులపై చర్చలు జరుపుతామని అన్నారు. చర్చల్లో కలిసి నడవాలనుకుంటున్న పార్టీల పట్ల టీడీపీ విశాల భావాలతో ఉందని, ఆయా పార్టీలు కూడా అదేరకమైన వైఖరి అవలంబించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.