: మోడీకి గట్టి పోటీ ఇవ్వనున్న మాజీ మాఫియా లీడర్?
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక సభ స్థానంలో గట్టి పోటీ ఎదురుకానుంది. ఇప్పటికే ఇక్కడి నుంచి మోడీపై పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ సిద్ధమయ్యారు. ఆయన మోడీపై పదునైన విమర్శలతో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. దీనికి తోడు మోడీకి పోటీ ఇవ్వడానికి మావ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ కూడా రెడీ అవుతున్నారు. క్వామీ ఏక్తాదళ్ పార్టీ తరపున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2009 ఎన్నికల్లో వారణాసిలో బీజేపీ నేత మురళీ మనోహర్ జోషిపై కూడా ముఖ్తార్ పోటీ చేశారు. అప్పట్లో ముఖ్తార్ పై నెగ్గడానికి జోషి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కేవలం 20 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ తీవ్రస్థాయిలో ఉండనున్నట్లు తెలుస్తోంది.