: విశాఖ నుంచి ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం
విస్తరణ ప్రణాళికలో భాగంగా ఇండిగో ఎయిర్ లైన్స్ ఇవాళ్టి నుంచి మరిన్ని విమాన సర్వీసులను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. ఆదివారం నుంచి ఆరు కొత్త విమాన సర్వీసులను ఇండిగో ప్రారంభిస్తోంది. విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, భువనేశ్వర్, రాంచీ, కోల్ కతాల నుంచి కొత్త సర్వీసులు నిర్వహిస్తామని ఇండిగో ప్రకటించింది. బెంగళూరు - భువనేశ్వర్, విశాఖ విమాన సేవలు నేటి నుంచి, మిగిలినవి ఏప్రిల్ 6వ తేదీ (వచ్చే ఆదివారం) నుంచి మొదలవుతాయని సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా 36 నగరాల మధ్య 485 విమాన సర్వీసులు నిర్వహిస్తుండడంతో ఈ రంగంలో మరింత బలపడతామని ఇండిగో సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది.