: వచ్చే రెండేళ్లలో కొత్తగా 750 యాక్సిస్ బ్యాంకు శాఖలు


వచ్చే రెండేళ్ల కాలంలో పట్టణాల్లో 750 శాఖలు ప్రారంభించనున్నట్లు యాక్సిస్ బ్యాంకు వెల్లడించింది. ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు నుంచి అనుమతి వచ్చినట్లు తెలిపింది. అలాగే, నియంత్రణ పరమైన నిబంధనలకు అనుగుణంగా 2013-14 ఆర్థిక సంవత్సంలో బ్యాంకు సేవలు లేని చోట 250 శాఖలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అయితే, బ్యాంకు సేవలు లేని మారుమూల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శాఖలు ఏర్పాటు చేయడం భారమవుతుందని యాక్సిస్ బ్యాంకు ప్రెసిడెంట్(రిటైల్ బ్యాంకింగ్) రాజీవ్ ఆనంద్ తెలిపారు. దేశంలో ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ తర్వాత, యాక్సిసే అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా ఉంది.

  • Loading...

More Telugu News