: చైనాలో భూకంపం


చైనాలోని హుబే ప్రావిన్స్ లో ఈ ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.7గా నమోదైంది. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ త్రీగోర్జెస్ కు 30కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చిన ప్రాంతం ఉండడం గమనార్హం. జింగీ కౌంటీలో భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఇదే ప్రాంతంలో గురువారం కూడా 4.3తీవ్రతతో స్వల్ప భూకంపం వచ్చింది. నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.

  • Loading...

More Telugu News