: వైఎస్సార్సీపీ కార్యకర్త ప్రాణం తీసిన ఘర్షణ
కడపజిల్లా మున్సిపల్ ఎన్నికల్లో దారుణం చోటుచేసుకుంది. టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. లక్కిరెడ్డిపల్లి మండలంలోని గుటకవానిపల్లిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీన్లో గంగిరెడ్డి (వైఎస్సార్సీపీ) అనే డీలర్ మృత్యువాతపడగా, మరో కార్యకర్త పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.