: సవాళ్లు, ప్రతి సవాళ్లతో బాహాబాహీకి దిగిన ఛైర్మన్ అభ్యర్థులు


మెదక్ జిల్లా సంగారెడ్డిలో మున్సిపల్ ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి. ఛైర్మన్ అభ్యర్థులే బాహాబాహీకి దిగడంతో పరిస్థితి చేయిదాటింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల మధ్య వాగ్వాదం చెలరేగింది. అది చిలికిచిలికి గాలివానగా మారి ఘర్షణకు దారితీసింది. దీంతో ఇద్దరూ బాహాబాహీకి దిగారు. దీంతో పరిస్థితి చేయిదాటింది. పోలీసుల రంగప్రవేశం చేసినప్పటికీ అభ్యర్థులు సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తించారు.

  • Loading...

More Telugu News