: ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి: రమాకాంత్ రెడ్డి


మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం అధికారి రమాకాంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 10 నగరపాలక సంస్థలు, 145 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమేరాలు పెట్టి పోలింగ్ సరళిని గమనిస్తున్నామని చెప్పారు. అన్ని జిల్లాల నుంచి ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్టు సమాచారం అందుతోందని ఆయన స్పష్టం చేశారు.

ఓటర్ల స్లిప్ లు లేకపోయినా పర్వాలేదని, ఓటర్ లిస్టులో పేరుంటే ఓటింగ్ లో పాల్గొనే అవకాశం కల్పించామని ఆయన తెలిపారు. ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది కనుక, 5 గంటల లోపు క్యూ లైన్లో ఉన్న వారంతా ఓటింగ్ లో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. ఓటర్ల లిస్టును తయారు చేసేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదని, కేంద్ర ఎన్నికల కమిషన్ అని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News