: ఎన్నికలు బహిష్కరించి, పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన నేతలు
కడప జిల్లా బద్వేలులో మున్సిపల్ ఎన్నికలు రసాభాసగా మారాయి. స్వతంత్ర అభ్యర్థి రమేష్ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఇళ్లపట్టాలు ఇచ్చారని టీడీపీ అభ్యర్థిని భర్త ఆనంద్ ఆరోపించారు. దీంతో రెండో వార్డులోని ఎన్నికలు రసాభాసగా మారాయి. టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఎన్నికలు బహిష్కరించి పోలింగ్ కేంద్రం నుంచి ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగిన వారిని లాఠీఛార్జి చేసి పోలీసులు చెదరగొట్టారు.