: 'మళ్లీ మేమే వస్తా'మంటున్న జగ్గారెడ్డి!
2014 సాధారణ ఎన్నికల్లోనూ విజయబావుటా ఎగరేస్తామని ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి దీమా వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రాల్లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య మీద ప్రజలకు, రైతులకు అవగాహన ఉందని, అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదన్నారు. గత ముఖ్యమంత్రులు చేసిన తప్పిదాల వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్ర రూపం దాల్చిందని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.