: నరేంద్ర మోడీకి నేనే అడ్డంకి: నితీష్ కుమార్
భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తానే ప్రధాన అవరోధమని బీహార్ సీఎం నితీష్ కుమార్ పేర్కొన్నారు. పాట్నాలో ఈరోజు (శనివారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మోడీ తనపై చేసిన విమర్శలను ఖండించారు. తాను తీవ్రవాదులు, ఉగ్రవాదుల వద్ద మెతగ్గా వ్యవహరిస్తున్నందువల్లే బీహార్ లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న మోడీ విమర్శల్లో ఏ మాత్రం నిజం లేదని నితీష్ చెప్పారు.